Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాలే

Nayanatara

Nayanatara

లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార తన సినీ ప్రయాణంలో మరో బిగ్ ఛేంజ్‌కి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ రీజనల్ సినిమాలు, పరిమిత బడ్జెట్ చిత్రాలకు ఇక గుడ్ బై చెప్పేసినట్లే అని సంకేతాలు ఇస్తున్నారు. కేవలం పాన్‌ ఇండియా సినిమాలు,భారీ బడ్జెట్‌ చిత్రాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఒకే భాషకు లేదా రీజనల్‌ స్టోరీస్‌కే ప్రాధాన్యం ఇచ్చిన నయన్, హిందీలో చేసిన ‘జవాన్’ సాధించిన ఘనవిజయంతో తన మార్కెట్‌ను ఊహించని రీతిలో పెంచుకున్నారు. ఇప్పుడు కేవలం ఐదు భాషల్లో ఒకేసారి విడుదలయ్యే దమ్మున్న కథలను, వందల కోట్ల బడ్జెట్ ఉన్న చిత్రాలనే తన కేలండర్‌లో లాక్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమా మైండ్ బ్లాంక్ అయ్యే కాంబినేషన్లతో నయనతార సంచలనం సృష్టిస్తున్నారు. కెజియఫ్ ఫేమ్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’లో నయన్ అత్యంత కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్‌లోనూ నయనతార కథానాయికగా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా.. దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్‌తో జతకడుతూ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి లేడీ సూపర్‌స్టార్ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు.

వలం బిగ్ స్టార్స్ పక్కన మెరవడమే కాదు… తన సోలో పవర్‌తోనూ పాన్-ఇండియా మార్కెట్‌ను ఏలేందుకు నయన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ స్పెక్టాకిల్ ‘రక్కయి’. పూర్తిస్థాయి పిరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌కే నెటిజన్లు ఫిదా అయ్యారు.’రక్కయి’లో నయన్ చేస్తున్న ఊరమాస్ యాక్షన్ అవతార్ సౌత్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. దీంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ‘హాయ్’ ప్రాజెక్ట్ కూడా ఇండియన్ వైడ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా పాన్-ఇండియా రేంజ్ బిజినెస్ తీసుకురావడం ఒక్క నయనతారకే సాధ్యమవుతోంది.