KV Anudeep: జాతిరత్నాలు డైరెక్టర్‌కి అరుదైన వ్యాధి.. అప్పుడు మెదడు పని చేయదట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KV Anudeep Reveals That He Is Suffering From Rare Disorder: కేవీ అనుదీప్.. తన తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ డైరెక్టర్ టాలీవుడ్ సెన్సేషన్‌గా అవతరించాడు. అంతేకాదు.. ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూతోనూ హైలైట్ అయ్యాడు. రొటీన్‌కి భిన్నంగా సరదా పంచ్‌లు వేస్తూ.. కడుపుబ్బా నవ్వించడం ఇతని స్పెషాలిటీ. అలాంటి అనుదీప్, ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
ఆ వ్యాధి పేరు హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్‌ఎస్‌పీ). తన శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల.. ఈ డిజార్డర్‌ని తాను గుర్తించానని అనుదీప్ తెలిపాడు. నిజానికి.. ప్రతి ఒక్కరిలోనూ ఈ డిజార్డర్ లక్షణాలు కామన్‌గానే ఉంటాయని, కానీ దాన్ని అర్థం చేసుకోలేరని పేర్కొన్నాడు. తనకు గ్లూటెన్ పడదని, కాఫీ తాగితే రెండ్రోజులపాటు నిద్ర పట్టదని చెప్పాడు. ఏదైనా పళ్ల రసం తాగితే.. తన మెదడు పనితీరు ఆగిపోతుందని, మైండ్ అంతా బ్లాక్ అవుతుందని అన్నాడు. ఆ సమయంలో తానేం చేస్తున్నానో అర్థం కాదన్నాడు. అయితే.. ఈ డిజార్డర్ ఉన్న వారి సెన్సెస్ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని చెప్పుకొచ్చాడు. కానీ.. ఈ వ్యాధి ఉన్నవారు చాలా త్వరగా అలసిపోతారని అనుదీప్ వెల్లడించాడు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాను ఎక్కువ కాంతివంతమైన లైట్స్‌ని, అలాగే ఘాటైన వాసనలు చూసినా.. వాటి తీవ్రతను తట్టుకోలేదని అనుదీప్ పేర్కొన్నాడు. ఈ వ్యాధి శాస్త్రీయంగా నిరూపించబడలేదని, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ వ్యాధి లక్షణాలున్నవారు.. ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాన్ని పరిశోధించి, ఆ ఆహారాల్నే తీసుకుంటున్నాని వివరించాడు. ఈ వ్యాధిపై తాను భవిష్యత్తులో తప్పకుండా ఒక సినిమా చేస్తానని, దాంతో కొందరైనా హీల్ అవుతాని తాను భావిస్తున్నానని అనుదీప్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!