Kushi Advance Booking Open Now: విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి విడుదలకు సర్వం సిద్ధమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న క్రమంలో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు కలెక్షన్స్ ను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు కూడా అనూహ్య స్పందన లభించడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ కనిపించిందని చెప్పక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఖుషి మూవీకి అన్ని ప్రాంతాల్లో భారీగా వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు అవుతున్నాయని అంటున్నారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది.
Rakshit Shetty: ఖుషీ రిలీజ్ రోజే హైదరాబాద్ లో కూడా రష్మిక మాజీ ప్రియుడి సినిమా
ఇండియాలోని అన్ని ప్రాంతాలతో పాటు ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఖుషి మూవీ ఏపీ, నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో నైజాంలో 750 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ ఆంధ్రలో 900 కిపైగా షోలకు బుకింగ్స్ అవుతున్నాయి. ఖుషీ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే రాసుకున్నాడు. కాగా, ఖుషీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభుల జోడీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో త్వరలో తెలియనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే నమోదవుతున్నాయి, ఇక పాజిటివ్ మౌత్ టాక్ కూడా వస్తే సినిమా హిట్టే అని అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు.