Site icon NTV Telugu

Kushboo Sundar: నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. అక్కడ తాకుతూ

Kushboo

Kushboo

Kushboo Sundar: ప్రస్తుత సమాజంలో మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప అమ్మాయికి బయట ఎక్కడా రక్షణ లేదు. ఇల్లు, స్కూల్, ఆఫీస్, అత్తారిల్లు.. భర్త, లవర్, అన్న, తమ్ముడు చివరికి కనిపెంచిన తండ్రి కూడా ఆమెను వదలడం లేదు. ఈ వేధింపులు సాధారణ మహిళలే కాదు సెలబ్రిటీలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సినీ నటి ఖుష్బూ తన చిన్ననాటి చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. కన్నతండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పి సంచలనం సృష్టించింది.

Venkatesh Maha: అతడు నీచ్ కమీనే కుత్తే అయితే.. నువ్వెంటీ మరీ

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూకు లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. అందుకు ఆమె సమాధానామిస్తూ.. ” నన్ను నా తండ్రే లైంగికంగా వేధించాడు. 8 ఏళ్ల వయస్సులో అతడు నాతో ప్రవర్తించిన తీరు నేను ఎప్పటికి మర్చిపోలేను. అసభ్యకరంగా తాకుతూ.. చిత్రహింసలు పెట్టేవాడు. ఈ విషయం మా అమ్మకు చెప్తామనుకున్నాను. కానీ, ఆమె నమ్ముతుందో లేదో అని భయపడ్డాను. ఎందుకంటే ఆమె భర్త చాటు భార్య. భర్తనే దైవం అనుకొనే సగటు గృహిణి. అతడు ఏది చెప్తే అది చేస్తోంది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఇక నాకు 15 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఆ బాధను భరించలేకపోయాను.. నా తండ్రికి ఎదురుతిరిగాను. దీంతో అతడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించింది. అయినా ఎదుర్కొని నిలబడ్డాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version