Site icon NTV Telugu

Kurukshetra : ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఎండ్‌.. చివరి యుద్ధానికి కౌంట్‌డౌన్ మొదలైంది!

Kurukshetra

Kurukshetra

ఇప్పటి వరకు ఇండియన్ యానిమేషన్‌ ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించిన మహావతార్ నరసింహ తర్వాత పలు కొత్త యానిమేషన్‌ ప్రాజెక్ట్‌లు ప్రకటించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి రాబోతున్న “కురుక్షేత్ర” సిరీస్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సిరీస్‌ పాన్ ఇండియా భాషలతో పాటు ఇంటర్నేషనల్‌ ఆడియెన్స్‌కూ చేరేలా రూపొందించబడింది. విడుదలైనప్పట్లో ఈ ప్రాజెక్ట్‌కు మంచి రెస్పాన్స్ అందింది. మొత్తం 18 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేసిన ఈ సిరీస్‌లో మొదట 9 ఎపిసోడ్స్‌ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మిగతా ఎపిసోడ్స్‌ ఎప్పుడు విడుదల అవుతాయనే క్లుస్ ఇప్పటి వరకు తెలియలేదు. అయితే, నెట్‌ఫ్లిక్స్ తాజాగా మిగతా 9 ఎపిసోడ్స్‌ ఈ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని ఖరారు చేసింది. ప్రస్తుతానికి, రిలీజ్‌ అయిన 9 ఎపిసోడ్స్‌కి ప్రేక్షకుల మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మిగతా ఎపిసోడ్స్‌ ఏవిధమైన విశేషాలను అందిస్తాయో, ప్రత్యేక యుద్ధ సన్నివేశాలు మరియు డ్రామాటిక్‌ మోమెంట్స్‌ ఎలా ఉంటాయో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version