NTV Telugu Site icon

Pataan: షారుఖ్ ఖాన్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ వస్తోంది…

Pataan

Pataan

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి పడేయగలదని నార్త్ సినీ అభిమానులు నమ్ముతున్నారు అంటే ‘పఠాన్’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహం నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ రీసెంట్ గా ‘నా నిజం రంగు’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. విజువల్ బ్యూటీ ఉన్న ఈ సాంగ్ లో హీరోయిన్ దీపిక, కాషాయ రంగు బికినీ వేసుకుందని నార్త్ ఆడియన్స్… పఠాన్ మూవీని బాయ్కాట్ చేస్తున్నారు.

మొదటి సాంగ్ బయటకి వచ్చే వరకూ పఠాన్ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ మూవీపై భారి నెగిటివిటి స్ప్రెడ్ అవుతోంది. నార్త్ లో పఠాన్ సినిమాని రిలీజ్ కూడా కానివ్వం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ తో, ఈ వివాదంతో సంబంధం లేకుండా ‘నా నిజం రంగు’ సాంగ్ యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదే జోష్ లో పఠాన్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ‘కుమ్మేసే పఠాన్’ అనే సెకండ్ సాంగ్ ని డిసెంబర్ 22న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా కాస్త హాటుగానే ఉంది కానీ కాషాయ రంగు అయితే లేదు. సో ‘కుమ్మేసే పఠాన్’ పాట వివాదానికి కేంద్రమయ్యే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా కావాలని పట్టుబట్టి మరీ వెతికి ఏదైనా తప్పుని బయటకి తీస్తారేమో చూడాలి.