Kubera Trailer : నాగార్జున, ధనుష్ నటించిన కుబేర మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. జూన్ 20న మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు.
Read Also : Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?
అందరూ ఊహించినట్టే ఈ ట్రైలర్ లో మనుషుల బంధాలు, డబ్బు అనే కోణంలో చూపించారు. రెండు నిముషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్” అని ధనుష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ప్రారంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. ”ఈ దేశంలో డబ్బు, పవర్ యే పనిచేస్తాయి.. నీతి, న్యాయం కాదు.. ఇదే చరిత్ర’ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ను బట్టి అతని పాత్ర ఏంటనేది అర్థం అవుతోంది.
ట్రైలర్ ను చూస్తుంటే కథంతా డబ్బు, అధికారం, మనుషుల భావోద్వేగాల కలయికతో దీన్ని శేఖర్ కమ్ముల్ కట్ చేయించారు. ఇందులో నాగార్జున, ధనుష్ పాత్రల మేళవింపు ఆకట్టుకుంటోంది. ఒక బిచ్చగాడికి, అత్యంత ధనవంతుడికి జరిగే ఘర్షణలా ఇది కనిపిస్తోంది. ఇందులో రష్మిక పాత్రకు కూడా మంచి స్కోప్ ఉన్నట్టు ట్రైలర్ లో కనిపిస్తోంది.
Read Also : Kantara Chapter 1 : ఆ వార్తలన్నీ ఫేక్.. స్పందించిన కాంతార టీమ్..
