Site icon NTV Telugu

మరో నాలుగు భాషల్లోకి మానస్ ‘క్షీరసాగర మథనం’

‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్‌ 5 టాప్ ఫైవ్‌ లో మానస్ కు చోటు దక్కడంపై ఆ చిత్ర నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానస్ తో పాటు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్‌, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్‌, ప్రదీప్ రుద్ర తదితరులు ‘క్షీరసాగర మథనం’లో ప్రధాన పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు వర్షన్ కు మంచి ఆదరణ లభిస్తోందని, అందుకే దీనిని త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేయాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్‌ పంగులూరి తెలిపారు. తమ కథానాయకుడు మానస్‌ బిగ్ బాస్ 5 విజేతగా నిలవాలనే ఆకాంక్షను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేశారు.

Exit mobile version