Kriti Sanon Talks About Prabhas Unique Quality: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఎవరినైనా అడిగితే.. ఒక్కటే మాట చెప్తారు. రుచికరమైన భోజనాలతో కడుపు నింపేస్తాడని! ఇక అంత పెద్ద హీరో అయినప్పటికీ, ఒదిగి ఉంటాడంటూ కితాబిస్తారు. కానీ.. కృతి సనన్ మాత్రం అందరి కంటే భిన్నంగా, అతనిలో ఉండే ఓ ప్రత్యేకమైన క్వాలిటీ గురించి చెప్పుకొచ్చింది. అవే.. అతని కళ్లు. ఆ కళ్లల్లో ఏదో తెలియని మత్తు ఉంటుందని, చూస్తుండగానే మనం మైమరిచిపోతామంటూ తెలిపింది.
రీసెంట్‌గా ఓ ప్రముఖ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కృతికి.. ‘ఫుడ్ స్టోరీ మినహాయించి, ప్రభాస్‌లో మీరు గమనించిన ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు కృతి బదులిస్తూ.. ‘ఫుడ్ స్టోరీని పక్కనపెడితే, అతని కళ్లంటే నాకు చాలా ఇష్టం. ఆ కళ్లల్లో ఏదో తెలియని మత్తు, ప్యూరిటీ ఉంటుంది. క్లోజ్ షాట్స్‌లో నేను కొన్ని సీన్లు చూశాను. కళ్లతోనే అతడు మాయాజాలం చేయగలడు. ఆ అనుభూతిని నేను చెందాను కూడా. అలాంటి ఎక్స్‌ప్రెసివ్ కళ్లు కలిగిన అతికొద్దిమంది హీరోల్లో ప్రభాస్ ఒకడు. వాటిని చూస్తున్నప్పుడు, నిజంగా ఓ మత్తులోకి జారిపోతారు. ఆ క్వాలిటీయే అతడ్ని ఇతర హీరోల కంటే చాలా భిన్నంగా మలిచింది’’ అని తెలిపింది.
ప్రభాస్‌తో తాను మళ్లీ మళ్లీ కలిసి నటించేందుకు ఇష్టపడతానని, అతనితో కలిసి పని చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని కృతి పేర్కొంది. కాగా.. ఆదిపురుష్ సినిమాలో కృతి సీత పాట్రలో కనిపించనుంది. ఇందులో వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా అద్భుతంటా ఉంటాయని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
