ప్రజంట్ హీరోయిన్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మొదటి సినిమాలో ఉన్న ముఖం, ప్రస్తుత లుక్ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. కాగా తాజాగా ఈ లిస్ట్ లోకి ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి కూడా చేరారు. తొలి చిత్రంలో తన అందంతో.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్‌లు కూడా ఆమెకు దక్కాయి. కానీ సినిమాల ఫలితాల విషయాన్ని పక్కన పెడితే..
Also Read : Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా జటాధార ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే..?
కెరీర్ ప్రారంభంలో కృతి ఫిగర్ బోద్దుగా, బబ్లిగా కనిపించేది. ఇప్పుడు సన్నగా మారడం తో ఫేస్ కూడా పూర్తిగా మారి పోయినట్టుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైట్ కలర్ సారీ లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోల్లో కృతి ఫేస్ పూర్తిగా మార్చబడినట్టు కనిపిస్తోంది, చాలామంది నెటిజన్లు దీనిని ‘సర్జరీ ఫేస్’ లాగా అనిపిస్తుందని పేర్కొన్నారు. ఫ్యాన్స్ ఈ కొత్త లుక్ చూసి షాక్‌గా ఉన్నారు. “కృతి ఏంటి.. మొత్తం ఇలా మారిపోయింది” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కామెంట్‌లు చేస్తున్నారు . కృతి శెట్టి కి సంబంధించిన ఈ మార్పు ఆమె కెరీర్, లుక్, సోషల్ మీడియాలో పెద్ద చర్చలకు కారణమైంది. అంతే కాదు ముందు ఫోటోలు, ప్రజంట్ ఫోటోలు కూడా పక్క పక్కన పెట్టి పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.
