Site icon NTV Telugu

Krithi Shetty: పాపం కృతి శెట్టి.. అంత మాట అనేశాడు ఏంటి? వీడియో వైరల్

Kruthi Shetty Video Viral

Kruthi Shetty Video Viral

Krithi Shetty counter about Skanda Movie: చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగులో ఆమె ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమె ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు వంద కోట్ల సినిమా చేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన శ్యాంసింగారాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడాయి, సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఎందుకో ఆమె చేసిన ఏ సినిమాలు ఆమెకు ఏ మాత్రం కలిసి రావడం లేదు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలు దాదాపు డిజాస్టర్ గా నిలిచాయి. ఈ నాలుగు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో సినిమాలే కరువైపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఒక మలయాళ సినిమా ఉంది.

Neru Movie Review: ‘నెరు రివ్యూ’.. లాగిపెట్టి కొట్టాలనిపించేలా ప్రియమణి యాక్టింగ్

శర్వానంద్ హీరోగా నటిస్తున్న 35 సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. అయితే తెలుగులో సినిమాలు లేకపోయినా ఆమెకు చేతినిండా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అంటే అదేనండీ షాప్ ఓపెనింగ్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. తాజాగా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఈ క్రమంలో ఒక అభిమాని ఆమెను మెచ్చుకుంటూ మీ స్కందా సినిమా చూశాను చాలా బాగుంది అని పేర్కొన్నాడు. వాస్తవానికి స్కంద సినిమాలో ఆమె హీరోయిన్గా నటించలేదు. శ్రీ లీల హీరోయిన్గా నటించడంతో ముందు కాస్త డౌట్ వచ్చినా ఆమె వెంటనే అవును బాగుంది కానీ నేను ఆ సినిమాలో నటించలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన ఆమె అభిమానులు అయితే అదేంది మామ అంత మాట అనేశాడు అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version