Krithi Shetty clarity on star hero son rumors: బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారింది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ కూడా తీసుకురావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమెకు సినిమా అవకాశాలు లభిస్తూ వస్తున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క తమిళంలో కూడా మెరుస్తోంది. అయితే తాజాగా ఆమె ఒక స్టార్ హీరో కొడుకు తన ఇబ్బంది పెడుతున్నాడని, తమిళ మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.
Rangabali: ముందు రోజే తెలుగు రాష్ట్రాలలో రంగబలి పెయిడ్ ప్రీమియర్స్
తమిళ్ లో ఒక స్టార్ హీరో కొడుకు ఆమె వెళుతున్న ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఆమె వెళుతున్న ప్రతి చోటకి వెళుతూ ఆమెకు కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కృతి శెట్టిని స్నేహితురాలుగా మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమెకి ఇష్టం లేక ఇబ్బంది పడుతున్నట్లు తమిళ మీడియాతో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం మీద కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి వార్తలు పుట్టించి తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని చేతులు జోడించి ఆమె త్వీట్ పెట్టింది. అసలు ఏ మాత్రం సెన్స్ లేని ఈ పుకార్లను లైట్ తీసుకుందామని అనుకున్నాను కానీ హద్దులు దాటి ఈ వార్త ముందుకు వెళ్తోంది కాబట్టి ఈ విషయం క్లారిటీ ఇస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు కానీ ఒక మలయాళ సినిమాతో పాటు జీని అనేది తమిళ సినిమాలో కూడా అని హీరోయిన్ గా నటిస్తుంది.
— KrithiShetty (@IamKrithiShetty) July 6, 2023