NTV Telugu Site icon

Krithi Shetty: దెబ్బ మీద దెబ్బ.. బేబమ్మకి ఏమైంది?

Krithi Shetty

Krithi Shetty

ఎంత స్పీడ్‌గా హ్యాట్రిక్ బ్యూటీగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అంతే స్పీడ్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీ అనిపించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిపడిన కృతి… ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది కృతి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలే కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. హ్యాట్రిక్‌ జోష్‌లో కమిట్ అయిన సినిమాలు కావడం ఒకటైతే.. కథల ఎంపిక కృతిని ఫెయిల్యూర్ వైపు అడుగులు వేసేలా చేశాయ్. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గిపోయాయి.

ప్రస్తుతం అమ్మడి చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. తమిళ్, మయాళంలో ఒకటి అర సినిమాలు చేస్తున్నా, తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీల రేసు గుర్రంలా దూసుకుపోతోంది. కృతి మాత్రం ఆమె స్పీడ్‌ను అందుకోలేకపోతోంది. రీసెంట్‌గా వచ్చిన నాగ చైతన్య ‘కస్టడీ’ సినిమా అయినా అమ్మడికి హిట్ ఇస్తుందని అనుకుంటే, అది కూడా నిరాశే మిగిలించింది. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది. దీంతో కృతి ఫ్లాప్ లిస్టులో మరో సినిమా చేరినట్లు అయ్యింది. ఇలానే కంటిన్యు అయ్యి, ఇంకో రెండు మూడు ఫ్లాప్స్ ఇస్తే చాలు దర్శక నిర్మాతలు హీరోలు కృతిని మర్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కృతిని ఈ ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయట పడేసి, ఒక మంచి హిట్ ఇచ్చే ఆ సినిమా ఏదో? ఎప్పుడు వస్తుందో చూడాలి.