Site icon NTV Telugu

Krishna Vamsi: అవును.. నేను, రమ్యకృష్ణ వేరుగా ఉంటున్నాం..

Ramya Krishan

Ramya Krishan

Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కస్టపడుతున్నాడు. ఒకప్పుడు హిట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కృష్ణవంశీ కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక చాలా కాలం తరువాత అతని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలోనే వీలు దొరికినప్పుడల్లా మీడియా తో ఇంటరాక్ట్ అవుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు కృష్ణవంశీ. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తన భార్య రమ్యకృష్ణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

“రమ్యకృష్ణను నేను పెళ్లాడే సమయానికే ఆమె స్టార్ హీరోయిన్.. ఆమె రేంజ్ వేరు.. ఆ రేంజ్ ను మ్యాచ్ చేయాలంటే నాకు చాలా టెన్షన్ గా ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఇద్దరం విడివిడిగా ఉంటున్నాం. నేను హైదరాబాద్ లో.. తను., నా కొడుకుతో చెన్నెలో ఉంటుంది. ఎప్పుడైనా కలవాలంటే నేను వెళ్లడమో, వాళ్లు ఇటు రావడమో చేస్తూ ఉంటారు. ఇక నా కొడుకు రిత్విక్.. వాళ్ళ అమ్మలాగే యమా యాక్టివ్. ఎంతైనా క్రాస్ బ్రీడ్ కదా. ఆ మాత్రం ఉంటుంది” అని కొడుకు గురించి చెప్తూ పొంగిపోయాడు. ఇక మీ ఇద్దరి మధ్య అభిప్రాయం బేధాలు ఉన్నాయని, విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి ఏమంటారు అన్న ప్రశ్నకు అలాంటి పుకార్లను మేము పట్టించుకోమని, ఇంట్లో మా ప్రపంచం వేరు ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి ఇన్నేళ్ల గ్యాప్ తరువాత ఈ క్రియేటివ్ డైరెక్టర్ హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది తెలియాలి.

Exit mobile version