Site icon NTV Telugu

Krish Jagaralamudi: ‘విరాట పర్వం’ ఫస్ట్ రివ్యూ చెప్పిన పవన్ డైరెక్టర్

Krish

Krish

ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అందరి చూపు విరాటపర్వం పైనే ఉంది. ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 1990 లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ గూస్ బంప్స్ ను తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన పలువురు ప్రముఖులు సినిమా అల్టిమేట్ అంటూ తమ రివ్యూ ను ఇచ్చిన విషయం విదితమే.

ఇక తాజాగా రేపు విడుదలవుతున్న ఈ సినిమా మొదటి రివ్యూ ఇచ్చాడు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. “ఈ సినిమాలో ప్రేమకు మీకు ఒక బ్రిడ్జి ఉంటుంది. రవన్న పాత్రలో నటించిన దగ్గుపాటి రానా, వెన్నెల పాత్రలో నటించిన సాయిపల్లవి అద్భుతమైన లవ్ స్టోరీలో చాలా చక్కగా నటించారు. దర్శకుడు వేణు ఉడుగుల అద్భుతమైన డైరెక్షన్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ విజన్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంది” ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే క్రిష్ ప్రస్తుతం పవన్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు కు దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో క్రిష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version