Site icon NTV Telugu

Kousalya Tanaya Raghava: విడుదలకు సిద్దమైన ‘కౌసల్య తనయ రాఘవ’

Kousalya Tanaya Raghava

Kousalya Tanaya Raghava

‘Kousalya Tanaya Raghava’ Ready For Release : విలేజ్ లవ్ స్టోరీగా రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్ల గా నటించిన ‘కౌసల్య తనయ రాఘవ’ అనే మూవీ రాబోతోంది. ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఒక మనిషికి మనిషి ఇచ్చే విలువలు మీద, ఒక మనసుకి ఇంకొక మనసు మీద ఉండే నిజమైన ప్రేమ మీద 198 వ సంవత్సరం నేపథ్యంలో జరిగే ఓ అందమైన పీరియాడిక్ కుటుంబ ప్రేమ కథే ఈ ‘కౌసల్య తనయ రాఘవ’ అని చెబుతున్నారు మేకర్స్.

అడపా రత్నాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన పాటలను మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిందని మేకర్స్ వెల్లడించారు. ఈ కౌసల్య తనయ రాఘవ షూటింగ్ అంతా శ్రీకాకుళం జిల్లాల పాలకొండ పరిసర ప్రాంతాల్లో పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉందని, మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్‌ని మేకర్లు ప్రకటించనున్నామని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి రాజేష్ రాజ్ తేలు సంగీతమందించగా.. యోగి రెడ్డి కెమెరామెన్‌గా పని చేశారు. శ్రీ కృష్ణ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. అర్జిత్ అజయ్ సాహిత్యాన్ని అందించారు.

Exit mobile version