Site icon NTV Telugu

Adhurs Sequel: NTR ఇంటి ముందు నిరాహార దీక్ష చేసయినా సరే Adhurs 2 చేయిస్తా!

Adhurs Re Release

Adhurs Re Release

Kona Venkat Reveals plan about Adhurs Sequel: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాలలో అదుర్స్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకి కోన వెంకట్ కథ అందించడం గమనార్హం. ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సుమారు పదిహేనేళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ కామెడీ అందించిన మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని రైటర్ కోన వెంకట్ వెల్లడించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.

Tillu Square: టిల్లు గాడి కోసం మొన్న మెగాస్టార్ ఇప్పుడు ఎన్టీఆర్

తనకు అదుర్స్ 2 సినిమా చేయాలని ఆలోచన ఉందని ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ చేయను అంటే ఆయన ఇంటి ముందు పిలక వేసుకుని కూర్చుని నిరాహార దీక్ష చేసి ఆయనని ఒప్పించి సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. వాళ్ళ కెరీర్ లోనే బెస్ట్ ఇచ్చాడు. ఈ పాత్రను ఎన్టీఆర్ లాగా చేసే యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి పాత్ర చేసే వాళ్ళు ఎవరూ లేరని అన్నాడు కోన వెంకట్. ఇక ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంటూ ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకొస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంబంధించిన టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్. ఇక ఈ సినిమాను కోన వెంకట్ నిర్మాణంలో.., శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి ప్రేక్షకులను భయపెట్టేందుకు రానుంది.

Exit mobile version