NTV Telugu Site icon

Priest Video: పురోహితుడిపై దారుణం.. తీవ్ర స్థాయిలో కోన వెంకట్, హరీష్ శంకర్ ఫైర్

Kona Venkat Harish Shankar

Kona Venkat Harish Shankar

Kona Venkat And Harish Shankar Fires On Priest Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. తాజాగా ఒక పురోహితుడిని ఒక వివాహ వేడుకలో అత్యంత దారుణంగా అవమానిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. దానిని ఒకప్పుడు టిడిపిలో ఉండి ప్రస్తుతం బిజెపిలో ఉన్న సాధినేని యామిని శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తనకు తెలియదు కానీ ఇలా ఒక నిసాహాయమైన స్థితిలో ఉన్న పురోహితుడిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఆమె రాసుకొచ్చారు. ఇక ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది, నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది.

Sabari Producer: నిర్మాతలకు వరలక్ష్మీ చేసే మేలు చాలా మందికి తెలియదు!

తాజాగా ఇదే విషయం మీద తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక రచయిత, మరొక స్టార్ డైరెక్టర్ ఇద్దరు స్పందించారు. ఈ విషయం మీద వారిద్దరూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక రచయిత కోన వెంకట్ స్పందిస్తూ ‘ఇది అత్యంత హేయనీయం.. ఖండనీయం, అన్ని కులాలను , మతాలను సమాన దృష్టితో చూడడంలో బ్రాహ్మణులు ముందుంటారు, వారిని గౌరవించక పోయినా పర్వాలేదు.. అవమానించకండి’ అని ట్వీట్ చేశారు. దీనికి చేతులు చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని జత చేశారు. ఇక ఇదే వీడియో పై స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్ ‘ఇదం బ్రాహ్మం.. ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి’ అని ట్వీట్ చేశారు. ఇక ఇదే వీడియో మీద బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై సహా అనేక మంది స్పందిస్తున్నారు.