టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ వెనుక ఉన్న త్రయం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆ, దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ చిత్రం నుండి 4వ పాట ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కొమురం భీమ్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసినట్టు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. “కొమురం భీముడో” అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. పూర్తి సాంగ్ ను రేపు విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ పాటను కాల భైరవ పాడగా, ఆయన తండ్రి, సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్ మరియు శ్రియా శరణ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 7, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆర్ఆర్ఆర్ : “కొమురం భీముడో” సాంగ్ ప్రోమో… భీమ్ ఎమోషన్స్
