Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ఎవరికి ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలు ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్నాయి. ఇక త్రివిక్రమ్ లో ఉన్న ప్రత్యేకతలో ఒకటి తన ఎదుగుదలకు కారణం అయిన వారి గురించి నిర్మొహమాటంగా అందరి ముందు చెప్పడం. నేను ఎదిగాను అంటే కారణం వారు అని చెప్పుకోవడానికి చాలామంది జంకుతారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తనతో ఉన్నది ఎవరు..? తన వెంట నిలబడింది ఎవరు..? తనను ఇంతవాడిని చేసింది ఎవరు..? అనేది ఎన్నోసార్లు ఎన్నో స్టేజిల మీద నిర్మొహమాటంగా చెప్పాడు. ఇక త్రివిక్రమ్ ను ఇక్కడివరకు నిలబెట్టిన వారిలో ఆయన గురువు.. రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు ఒకరు. ఈయన గురించి గురూజీ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా కొమ్మనాపల్లి గణపతి రావు తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు.
“అప్పట్లో నేను ఉద్యోగం చేస్తూనే పార్టీ టైమ్ రచయితగా పనిచేస్తున్నాను. ఇక ఒకరోజు నా దగ్గరకు త్రివిక్రమ్ వచ్చి తనను అసిస్టెంట్ గా జాయిన్ చేసుకోండి అని అడిగాడు. నేనే పార్ట్ టైమ్ చేస్తుంటే నిన్నేలా నేను అసిస్టెంట్ గా పెట్టుకోను అని అడిగాను. అప్పుడే ఏం చదివావు అని నేను ప్రశ్నించగా.. ఎమ్మెస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అన్నాడు. అప్పుడు నేను బుద్ది ఉందా నీకు.. ఇండస్ట్రీలో అస్సలు బాగా లేదు. వెళ్లి మంచి జాబ్ చేసుకో .. డబ్బులు వస్తాయి. అంతమంచి జీవితం వదిలేసి ఇక్కడకు వచ్చావా..? అని కోప్పడ్డాను. అందుకు త్రివిక్రమ్ లేదు.. నేను ఇండస్ట్రీలో ఉంటాను అని చెప్పుకొచ్చాడు. దీంతో కథలు ఏమైనా రాశావా అంటే లేదని అన్నాడు. ఇండస్ట్రీలో ఉండాలంటే కథలు పట్టుకొని తిరగలి అని చెప్పగానే నెక్స్ట్ డే ది రూడ్ అనే కథతో ప్రత్యేక్షమయ్యాడు. నేను దాన్ని ఒక న్యూస్ పేపర్ లో అచ్చు వేయించాను. దాన్ని చూసి త్రివిక్రమ్ ఎంతో మురిసిపోయాడు. ఆ తరువాత ఒక సినిమాలో అతడిని అసిస్టెంట్ గా పెట్టించాను. అయితే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసినా తన ఎదుగుదలకు నేను కూడా కారణం అని త్రివిక్రమ్ చెప్పడం ఆనందంగా ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
