Site icon NTV Telugu

Kollywood: తమిళ సినిమాల సౌండ్ లేదేంటి? రెండూ పోయినట్లేనా…

Varisu Thunivu

Varisu Thunivu

2023 సంక్రాంతికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆన్ అయ్యింది. ఒకేసారి రిలీజ్ అయిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, ఫాన్స్ కి వింటేజ్ వైబ్స్ ఇవ్వడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్యల్లాగే కోలీవుడ్ లో విజయ్, అజిత్ ల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరుగుతోంది. ఈ సంక్రాంతికి అజిత్ ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తే, విజయ్ ‘వారిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మన దగ్గర అయిన చిరు, బాలకృష్ణల సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి కానీ తమిళనాడులో మాత్రం వారిసు, తునివు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఒక యాక్షన్ డ్రామా ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా కావడంతో అజిత్, విజయ్ లు ధైర్యంగా తమ సినిమాలని ఒకేరోజు ఆడియన్స్ ముందుకి తెచ్చారు. రెండు సినిమాలకి కంటెంట్ పరంగా సంబంధం లేదు కానీ టాక్ పరంగా మాత్రం పోలికలు ఉన్నాయి.

వారిసు, తునివు సినిమాలు బ్లాక్ బస్టర్ రివ్యూస్ ని రాబట్టడంలో ఫెయిల్ అయ్యాయి. రెండు సినిమాలకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అభిమానుల విషయం పక్కన పెడితే కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తునివు కన్నా వారిసు బాగుంది, వారిసు కన్నా తునివు బాగుంది అంటున్నారు అంటే రెండు సినిమాలు సోసో గానే ఉన్నాయి అని అర్ధం. కలెక్షన్స్ విషయంలో కూడా తునివు, వారిసు సినిమాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఓవర్సీస్ లో విజయ్ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంటే, తమిళనాడులో దాదాపు 10 కోట్ల మార్జిన్ తో అజిత్ లీడ్ లో ఉన్నాడు. లాంగ్ రన్ లో ఏ సినిమా నిలబడుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే మిక్స్డ్ టాక్ తో రెండు సినిమాలు వీక్ గానే ఉన్నాయి. తెలుగులో తెగింపు సినిమాకి సోలో రిలీజ్ దొరికింది కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చెయ్యలేకపోయింది. వారసుడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి అదైనా కాస్త సౌండ్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version