ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ అనగానే ఎన్టీఆర్-రాజమౌళి, రాజమౌళి-ప్రభాస్, సంజయ్ లీలా భన్సాలీ-రణ్వీర్ సింగ్, రాజ్ కుమార్ హిరానీ-సంజయ్ దత్, వెట్రిమారన్-ధనుష్, త్రివిక్రమ్-అల్లు అర్జున్… ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద లిస్టే వస్తుంది. ఓవరాల్ ఇండియా వైడ్ గా మాట్లాడితే సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’ దాదాపు మొదటి స్థానంలోనే ఉంటారు. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ ఇది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ సూర్య ‘సింగం’ సినిమాని హిందీలో రీమేక్ చేసి మాస్ హిట్ కొట్టారు. ఆ తర్వాత సింగం రిటర్న్స్ పేరుతో మరో సినిమా చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. నార్త్ ఆడియన్స్ కి పోలిస్ సినిమా అనగానే ‘సింగం’ క్యారెక్టర్ గుర్తొచ్చే రేంజులో రెండు సినిమాలు ఆడడంతో, ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘సూర్యవన్షీ’ సినిమా క్లైమాక్స్ లోకి అజయ్ దేవగన్ ని తీసుకోని వచ్చి సింగం 3కి లీడ్ ఇచ్చాడు రోహిత్ శెట్టి.
‘సూర్యవన్షీ’ సినిమా చూసినప్పటి నుంచి ఆడియన్స్ ‘సింగం 3’ ఎప్పుడు అని అడుగుతున్నారు. దీంతో రోహిత్ శెట్టి ‘సింగం అగైన్’ సినిమాని కిక్ స్టార్ట్ చేసి, రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లిపోయాడు. ‘సూర్యవన్షీ’ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ఒక టెర్రరిస్ట్ కోసం పాకిస్థాన్ వెళ్తున్నట్లు చూపించారు కాబట్టి ‘సింగం అగైన్’ పాకిస్థాన్ నేపధ్యంలో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పాన్ ఇండియా హవా ఉంది, దాన్ని కాష్ చేసుకుంటూ రోహిత్ శెట్టి ‘సింగం యూనివర్స్’లోకి సూర్యని తీసుకోని రాబోతున్నాడట. అజయ్ దేవగన్ సూర్యలు కలిసి ఈ కాప్ యూనివర్స్ లో నటిస్తే, ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటి. మరి బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ని రోహిత్ శెట్టి నిజం చేస్తాడా లేక ఇది ఒక రూమర్ గా మిగిలిపోతుందా అనేది చూడాలి.