Ab Raju: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఒక హాస్యనటుడు చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఆశ చూపించి ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన ప్రస్తుతం కోలీవుడ్ లో సంచలనం గా మారింది. ఏబీ రాజు.. కోలీవుడ్ లో హాస్యనటుడిగా మంచి పేరుతెచ్చుకున్నాడు. అతని భార్య బుల్లితెర సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ లో ఈ జంట కనిపిసి నివసిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లోనే కింద ప్లాట్ లో రెండో తరగతి చదివే ఒక చిన్నారి కుటుంబంతో కలిసి ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిన్నారి ఖాళీ దొరికినప్పుడల్లా రాజు ఇంటికి వెళ్లి ఆడుకొంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు 14 రాత్రి చిన్నారి రాజు ఇంటికి వెళ్ళింది.
ఇంట్లో ఎవరు లేకపోవడంతో రాజు బాలికను దగ్గరకు తీసుకొని చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమె ప్రైవేట్ భాగాలను తాకుతూ అత్యాచారం చేయడానికి యత్నించాడు. బాలిక ఏడవడం మొదలుపెట్టేసరికి ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఏమి చెప్పలేదు. అయితే అప్పటి నుంచి బాలిక ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో విషయం బయటపెట్టింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు చెన్నై పోలీస్ స్టేషన్ లో రాజుపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును విచారించగా నేరాన్ని ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
