NTV Telugu Site icon

Ajith Vs Vijay: క్లాష్ ఆఫ్ టైటాన్స్ కి కోలీవుడ్ సిద్ధం… కొంచెంలో మిస్ అయ్యింది

Vijay Vs Ajith

Vijay Vs Ajith

తల అజిత్… దళపతి విజయ్… బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నారు అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజిత్ విడ ముయార్చి, విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వార్ కి దిగితే కోలీవుడ్ లో సాలిడ్ క్లాష్ జరగడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం మేరకు అజిత్-విజయ్ మధ్య క్లాష్ జరిగే అవకాశం కనిపించట్లేదు. విడ ముయార్చి సినిమా మై 1న అజిత్ పుట్టిన రోజున రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుండగా… ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా జూన్ 13న థియేటర్స్ లోకి రానుందని టాక్. సో రెండు సినిమాల మధ్య కనీసం 45 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి రెండు సినిమాల కలెక్షన్స్ కి ఎలాంటి నష్టం వచ్చేలా కనిపించట్లేదు.

ఒకవేళ క్లాష్ జరిగినా కూడా విడ ముయార్చి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలకి పెద్దగా లాస్ రాకపోవచ్చు. ఓపెనింగ్ డే రోజున కలెక్షన్స్ విషయంలో తప్ప… సెకండ్ డే నుంచి ఏ సినిమా బాగుంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుంది అంతే. నిజానికి అజిత్ విజయ్ మధ్య బాక్సాఫీస్ వార్ కొత్తగా జరిగేదేమి కాదు. 1996 నుంచే ఈ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతోంది. ఆ ఇయర్ లో అజిత్ నటించిన ‘వన్మతి’, విజయ్ నటించిన ‘కోయంబత్తూరు మాప్లా’ అనే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అప్పటినుంచి మొదలైన ఈ ఫ్యాన్ వార్, 2001 నుంచి తారాస్థాయికి చేరుకుంది. 2001లో అజిత్ నటించిన ‘ధీనా’, విజయ్ నటించిన ‘ఫ్రెండ్స్’ అనే సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి, రెండు సూపర్ హిట్స్ అయ్యాయి. 2023లో కూడా అజిత్-విజయ్ వారసుడు-తునివు సినిమాలతో క్లాష్ కి వెళ్లి ఇద్దరూ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టారు. సో దాదాపు రెండు దశాబ్దాలుగా అజిత్ విజయ్ బాక్సాఫీస్ దగ్గర పోటి పడుతూనే ఉన్నారు, వాళ్ల అభిమానాల మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది.

Show comments