Site icon NTV Telugu

Nani 31: నానికి విలన్ గా మహా నటుడు…

Nani 31

Nani 31

అంటే సుందరానికి… ఈ మధ్య కాలంలో నాని నటించిన లైట్ వెయిట్ సినిమా. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా లాంటి హెవీ రోల్స్ చేసిన నాని… అంటే సుందరానికి సినిమాలో తనకి టైలర్ మేడ్ లాంటి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొంతమందికి విపరీతంగా నచ్చింది, మరికొంతమందికి అసలు నచ్చలేదు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అంటే సుందరానికి సినిమాలో నాని కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యింది. డిసెంబర్ 7న ‘హాయ్ నాన్న’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న నాని, నెక్స్ట్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే సుందరానికి’ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… వివేక్ ఆత్రేయతో నాని సినిమాని అనౌన్స్ చేసాడు. చాలా రోజులుగా వినిపిస్తున్న ఈ కాంబినేషన్ అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది.

డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో 31వ చిత్రంగా రాబోతుంది. #Nani31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీలో నాని కొత్త సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అక్టోబర్ 24న గ్రాండ్‌గా లాంచ్ అవనున్న ఈ సినిమాలో నాని పక్కన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా… లేటెస్ట్ గా మేకర్స్ మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. నాని 31 సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ‘ఎస్ జే సూర్య’ నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేసారు. ఈ మధ్య కాలంలో ఎస్ జే సూర్య నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు నాని సినిమాకి ఎస్ జే సూర్య నటిస్తుండడం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమా మార్కెట్ కి చాలా హెల్ప్ అవుతుంది. తెలుగు, తమిళ మార్కెట్ ని క్రాక్ చేయడానికి పర్ఫెక్ట్ కాస్టింగ్ ని సెట్ చేసిన వివేక్ ఆత్రేయ, నానితో ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి.

Exit mobile version