NTV Telugu Site icon

Model Pooja Sarkar: బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడాక మోడల్ ఆత్మహత్య

Pooja Sarkar Suicide

Pooja Sarkar Suicide

Kolkata Model Pooja Sarkar Dies By Suicide After Boyfriend Call: ఈమధ్య కాలంలో చిత్రసీమలో తరచూ విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా కోల్‌కతాకు చెందిన పూజా సర్కార్ (21) అనే మోడల్ సూసైడ్ చేసుకుంది. తాను అద్దెకు ఉంటోన్న ఇంట్లో ఉరివేసుకొని, బలవన్మరణానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

నార్త్‌ 24 పరగణాస్‌ జిల్లాలో పూజా సర్కార్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో నివసిస్తున్న ఈ అమ్మాయి.. శనివారం (జులై 16) సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లింది. పార్టీ చేసుకున్న తర్వాత అందరూ తిరిగి వచ్చేశారు. అప్పుడు పూజాకి బాయ్‌ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. అతనితో మాట్లాడిన తర్వాత పూజా పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్లి, లోపల నుంచి గెడియ పెట్టేసుకుంది. దాంతో భయపడిపోయిన ఆమె స్నేహితులు, తలుపు తీయమని డోర్ కొట్టారు. ఎంత ప్రయత్నించినా ఆమె డోర్ తీయకపోవడంతో, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. తలుపు బద్దలుకొట్టి చూడగా, పూజా విగతజీవిగా కనిపించింది. ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె చనిపోవడానికి ముందు తన బాయ్‌ఫ్రెండ్‌‌తో ఫోన్‌లో మాట్లాడిందని పూజా స్నేహితులు తెలిపారు. దీంతో.. ఆమె సూసైడ్‌కి అదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని, ఆ బాధలోనే పూజా ఈ కఠిన నిర్నయం తీసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, విచారణ చేస్తున్నారు. పూజా ఆత్మహత్య వార్త విని, ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా.. గత మూడు నెలల్లో ముగ్గురు మోడల్స్‌ సూసైడ్ చేసుకున్నారు. మే 24వ తేదీన బిదిషా డే మజుందార్‌ అనే మోడల్‌ తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకొని చనిపోగా.. ఆమె స్నేహితురాలు, మోడల్ అయిన మంజుషా నియోగి కూడా అదే నెలలో 27న పటులిలో సూసైడ్ చేసుకుంది. సరైన అవకాశాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేయడంతో పాటు రిలేషన్‌షిప్ దెబ్బతినడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పూజా సర్కారు సైతం రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వల్లే సూసైడ్ చేసుకొని ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments