Klin Kaara Konidela, entered the KONIDELA House: పెళ్లి ఆయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయ్యారన్న సంగతి తెలిసిందే. 2023 జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనివ్వగా ఆమెకు క్లిన్ కార అని నామకరణం చేశారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు ఎంచుకున్నట్లు చిరంజీవి అప్పట్లో అధికారికంగా వెల్లడించారు. అయిదు హిందూ సాంప్రదాయం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చాక జన్మనిచ్చిన తల్లి తన పుట్టింట్లో ఉండాలి. కనీసం మూడు నెలలు పుట్టింట్లో గడిపాకనే అత్తింటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆ సంప్రదాయం ప్రకారం ఉపాసన తన తల్లితండ్రులు శోభన కామినేని, అనిల్ ఇంట్లోనే ఈ మూడు నెలలు ఉన్నారు. ఆ మూడు నెలలు పూర్తి కావడంతో కొణిదెల నివాసం అయిన చిరంజీవి ఇంటికి క్లిన్ కార తన తల్లిదండ్రులతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. ఇక వారసురాలు మొదటి సారిగా ఇంట్లో అడుగు పెడుతున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ ప్రత్యేకంగా నిర్వహించారు.
Nithya Menen: ‘కుమారి శ్రీమతి’గా నిత్యా మీనన్ – ఎక్కడ, ఎందులో చూడాలంటే?
చిన్న జీయర్ స్వామి ఆశ్రమానికి చెందిన వేదపాఠశాల విద్యార్థులు క్లిన్ కార ఇంట్లో అడుగుపెడుతుండగా వేద మంత్రాలు ఉచ్ఛరించారు. క్లిన్ కారను వేదమంత్రాల నడుమ ఇంట్లోకి అహ్వానించారు. ఇక ఇదే సమయంలో వినాయక విగ్రహాన్ని కూడా కొణిదెల నివాసంలోకి తీసుకువచ్చారు. చిరంజీవి, సురేఖ ముద్దుల మనవరాలిని చూసి సంబరపడిపోగా రామ్ చరణ్ తన హ్యాపీనెస్ ని సోషల్ మెయిల్లో షేర్ చేసుకున్నారు. “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను!🙏 ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం” అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.