Klin Kaara Caretaker Savitri Nanny Details: ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో హైదరాబాద్ తో పాటు ముంబైలో కూడా ఎక్కువ కాలం వెచ్చించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కుమార్తె క్లీంకార ఆయనతో పాటు ట్రావెల్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు కానీ, కెమెరాలు కంట పడుతున్నాయి అనుకున్నప్పుడు గానీ ఉపాసన జాగ్రత్త పడుతూ తన కుమార్తె క్లీంకార ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో క్లీంకారను ఎత్తుకొని ఒక ఆయా కనిపిస్తున్నారు. దీంతో ఆమె ఎవరు? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే నిజానికి ఆమె ఒక సెలబ్రిటీ కేర్ టేకర్. ఆమె పేరు సావిత్రి. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ దంపతుల పెద్ద కుమారుడు తైమూర్ ఖాన్ కి ఆమె కేర్ టేకర్ గా పని చేసింది.
Vyuham Movie : వ్యూహం సినిమా పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. ఏం చెప్పిందంటే?
ఆ తర్వాత మరికొందరు సెలబ్రిటీల పిల్లలకు కూడా ఆమె కేర్ గా పని చేసింది. ఇక ఇప్పుడు ఆమెను ఉపాసన తన కుమార్తె క్లీంకార కేర్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీ కేర్ టేకర్ కావడంతో జీతాలు కూడా ఆ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. ఆమెకు దాదాపుగా నెలకు 1,75,000 జీతం ఇస్తారని దానికి తోడు ఒకవేళ ఎక్స్ట్రా హవర్స్ పని చేస్తే దానికి కూడా జీతం ఇస్తారని సెలవులు లేకుండా పని చేయాలి కాబట్టి వాటికి తగ్గ రెమ్యూనరేషన్ ఇస్తారని తెలుస్తోంది. అయితే వాళ్లకు ఇంత జీతం ఇవ్వడానికి వెనుక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే వీళ్లు మామూలుగా ఆయాలలో కాదని, వీరికి చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యం విషయంలో కూడా అవగాహన ఉంటుంది అని చెబుతున్నారు. అందుకు వారు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వీరికి ట్రైనింగ్ ఇచ్చి ఇలా సెలబ్రిటీల వద్ద ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాయని టాక్.