Kiran Rathod Shares her Mental Trauma regarding Cannes Festival: కిరణ్ రాథోడ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రాజస్థాన్ లో పుట్టి పెరిగిన ఆమె 2001లో హిందీ సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత నువ్వు లేక నేను లేను అనే తెలుగు సినిమాలో అంజని పాత్రలో నటించింది. తమిళ్ జెమిని సినిమాలో కనిపించి ఒక్కసారిగా అక్కడి వారికి హాట్ ఫేవరెట్ అయింది. తర్వాత అనేక తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన ఆమె 2016లో సినిమాలు చేయడం ఆపేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కాలం గడిపేస్తోంది. ఈ మధ్యనే ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో కూడా పాల్గొన్నది. అయితే మొదటి వారమే బయటకు వచ్చేసి ఒకసారిగా అభిమానులందరికీ షాక్ ఇచ్చింది.
Karate Kalyani : చేసిందే తప్పుడు పని.. హేమ భర్తను లాగుతూ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్
ఆ సంగతి అలా ఉంటే ఆమె సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసింది. అదేమంటే ప్రస్తుతం జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు తాను హైదరాబాద్ విఎఫ్ఎస్ సెంటర్లో ఏప్రిల్ 19వ తేదీన వీసా అప్లై చేశానని, అది చేసి ఇప్పటికే 15 రోజులు పూర్తయింది, అయినా వాళ్ల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు నా పాస్పోర్ట్ కూడా కొరియర్ లో రాలేదు. నా పాస్పోర్ట్ ట్రాక్ చేయాలని ట్రై చేస్తే డీటెయిల్స్ ఇన్ వాలిడ్ అని చెబుతోంది. విఎఫ్ఎస్ ఉద్యోగులని అడిగితే వాళ్ళు చెక్ చేసినా అదే చూపిస్తోంది అంటూ ఆమె పోస్ట్ చేసింది. తాను మే 13వ తేదీన బయలుదేరాల్సి ఉంది, నా టీం మొత్తం అక్కడికి వెళ్ళింది.
ఆల్రెడీ స్క్రీనింగ్ అయిపోయింది, లాంచింగ్ అయిపోయింది కానీ నెల రోజుల నుంచి నేను వీసా, పాస్ పోర్ట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. మీరు వీసా ఇవ్వకపోవడం వల్ల నాకు 15 లక్షలు నష్టం వచ్చింది. నా హోటల్ బుకింగ్స్ అయిపోయాయి ఫ్లైట్ బుకింగ్ అయిపోయాయి. ఇప్పటికీ నా పాస్పోర్ట్ ఎక్కడుంది అనే విషయాన్ని ట్రేస్ చేయలేకపోయాను. దీనివల్ల నేను ఎంతో మెంటల్ ట్రామా, ఫైనాన్షియల్ ట్రామా అనుభవించాను నాకు దీనికి సమాధానం కావాలి అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి కారణం విఎఫ్ఎస్ గ్లోబల్ అలైన్ సంస్థ అని తనకు ఆ సంస్థ నుంచి సమాధానం కావాలని ఆమె పేర్కొంది.