NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డికి స్టార్ హీరో మాజీ భార్య స్ట్రాంగ్ కౌంటర్?

Kiran Rao Vs Sandeep Reddya

Kiran Rao Vs Sandeep Reddya

Kiran Rao Befitting Reply To Kabir Singh Animal Fame Director Sandeep Reddy Vanga: స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్సింగ్ లేడీస్’ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ, OTTలో విడుదలైన తర్వాత, ఈ సినిమాపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమా చూసి ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు అందరూ కిరణ్‌రావుకు ఫ్యాన్స్ అయిపోయారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్ ద్వారా కిరణ్ రావు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజానికి కిరణ్‌రావు, సందీప్‌రెడ్డి వంగాల మధ్య గత కొన్ని రోజుల క్రితం వాగ్వాదం జరిగింది. సందీప్ రెడ్డి సినిమాల కంటెంట్ పై కిరణ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం మీద సందీప్ రెడ్డి వంగ కూడా స్పందించారు. అయితే, ఆ విషయం ఇప్పుడు మరుగున పడింది అనుకోండి. కానీ OTTలో ‘Lapta Ladies’ రావడంతో నెటిజన్లు ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు.

Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఈ సినిమాలో ఫూల్ కుమారి (నితాన్షి గోయల్) – మంజు బాయి (ఛాయా కదమ్) మధ్య సంభాషణను చూపించే సన్నివేశం ఉంది. ఈ సమయంలో, మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో మాట్లాడుతుంది. తన భర్త తనను కొట్టాడని చెప్పింది, దానికి మంజు, ‘నిన్ను ప్రేమించే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది, ఒకరోజు నేను కూడా నా హక్కులను బయట పెట్టాను అని కామెంట్ చేస్తుంది. కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని సీన్ ని సోషల్ మీడియా యూజర్లు సందీప్ రెడ్డి వంగాపై వ్యంగ్యంగా పరిగణిస్తున్నారు. నిజానికి ఆయన ‘కబీర్ సింగ్’ సినిమాలో ఓ సీన్ ఉంది. ఇందులో కబీర్ (షాహిద్ కపూర్) ప్రీతి (కియారా అద్వానీ)ని చెంపదెబ్బ కొడతాడు. సినిమాలోని ఈ సీన్ పై అప్పట్లో బాలీవుడ్ లో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, ‘మీరు మీ స్త్రీని తాకలేకపోతే, మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు, మీరు ముద్దు పెట్టుకోలేరు. మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించలేరు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ డైలాగ్స్ కి కిరణ్ రావు సినిమాలో సీన్ తో కౌంటర్ ఇచ్చారని కామెంట్లు వస్తున్నాయి.

Show comments