NTV Telugu Site icon

Kiran Abbavaran: మార్చ్ 29న మాస్ ‘మీటర్’ ఎంతో చూపించబోతున్నాడు

Kiran Abbavaram

Kiran Abbavaram

ఫ్లాప్ స్ట్రీక్ నుంచి సాలిడ్ గా బయట పడిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. అన్ని సెంటర్స్ లో మంచి ప్రాఫిట్స్ రాబట్టిన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా కిరణ్ అబ్బవరంకి మచ్ నీడెడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. కెరీర్ లో మొదటిసారి పోలిస్ పాత్రలో నటిస్తున్న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో మాస్ మీటర్ ని పెంచబోతున్నాడు.

Read Also: Orange: థియేటర్స్ ని మ్యూజికల్ కాన్సర్ట్ లా మార్చేసారు…

అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని రమేష్ కాడురి డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి కార్తీక్ మ్యూజిక్ ఇప్పటికే ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మీటర్ సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మార్చ్ 29న మీటర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. టీజర్ తో మెప్పించిన కిరణ్ అబ్బవరం, ట్రైలర్ తో సినిమాపై అంచనాలకి మంచి మీటర్ సెట్ చేసి హిట్ స్ట్రీక్ ని కంటిన్యు చేస్తాడేమో చూడాలి.

https://twitter.com/ClapEntrtmnt/status/1639857116952547328

Show comments