Site icon NTV Telugu

Chennai Love Story : కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి..

Chennai Love Story

Chennai Love Story

Chennai Love Story : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్, గ్లింప్స్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి రిలీజ్ చేశారు. కలర్ ఫొటో, బేబీ మూవీ మేకర్స్ సాయిరాజేశ్, ఎస్కేఎన్ దీన్ని నిర్మిస్తున్నారు. రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ‘చెన్నై లవ్ స్టోరీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కిరణ్‌ అబ్బవరంకు జోడీ శ్రీ గౌరి ప్రియ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ చేయడంతో మూవీపై బజ్ ఏర్పడింది. ఇక గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం చాలా ఫ్రెష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

Read Also : HHVM : ‘వీరమల్లు’ టికెట్ల రేట్ల పెంపు.. ఫిల్మ్ ఛాంబర్ కు ఏఎం రత్నం..

ఇందులో ‘తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుంది’ అంటూ గ్లింప్స్ సాగింది. సముద్రపు ఒడ్డున కిరణ్‌, శ్రీ గౌరి ఫస్ట్ లవ్, బెస్ట్ గురించి మాట్లాడుకునే సీన్ తో గ్లింప్స్ ను కట్ చేశారు. ఒక రకంగా ఇది యూత్ ను ఆకట్టుకునే ప్రేమ కోణంలోనే తీస్తున్నారని అర్థం అవుతోంది. ఫస్ట్ లవ్ ఒకటే కాదని.. దానికి మించిన బెస్ట్ లవ్ కూడా లైఫ్ లో ఉంటుందనే కోణంలో మూవీని ప్రజెంట్ చేయబోతున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. దీన్ని కూడా యూత్ ఫుల్ సరికొత్త లవ్ స్టోరీగా తీసుకొస్తున్నారు.

క సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్‌.. ఆ తర్వాత మళ్లీ ప్లాప్ చూశాడు. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆల్రెడీ హిట్ జోడీ అనిపించుకున్న ఎస్కేఎన్, సాయిరాజేశ్ లు ఈ మూవీని అన్నీ తామై చూసుకుంటున్నారంట. రాజేశ్ ఈ మూవీ స్టోరీ అందించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూడని కొత్త రకమైన లవ్ స్టోరీని ఇందులో చూపించబోతున్నారంట.

Read Also : The Raajasaab : రాజాసాబ్ టీజర్ ఆగమనం.. రేపే అప్డేట్..?

Exit mobile version