NTV Telugu Site icon

Kiraak RP: నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసిన జబర్దస్త్ కమెడియన్..

Rp

Rp

Kiraak RP: జబర్దస్త్ ద్వారా పరిచయమై కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు కిర్రాక్ ఆర్పీ. నాగబాబు, రోజా జడ్జిలుగా ఉన్న సమయంలోనే ఆర్పీ షో నుంచి బయటికి వచ్చేశాడు. అనంతరం నిర్మాతగా మారి ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. మళ్లీ తిరిగి కామెడీనే నమ్ముకొని మరో ఛానెల్ లో కమెడియన్ గా సెటిల్ అయ్యాడు. ఇక ఈ మధ్యనే జబర్దస్త్ గురించి అందులో ఉన్నవారి గురించి ఒక ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి షాక్ ఇచ్చాడు. ఇక కామెడీ షోలు అన్ని పక్కన పెట్టి నెల క్రితమే కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. ఊహించని విధంగా ఈ కర్రీ పాయింట్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడికి వచ్చే జనాన్ని ఆపలేక ఆర్పీ బౌన్సర్లను కూడా పెట్టాడు. దాదాపు లక్షల్లో లాభాలను ఆర్జించడం మొదలుపెట్టాడు ఆర్పీ. నెల్లూరు నుంచి ఫ్రెష్ చేపలను తెచ్చి.. మంచిగా వండుతుండడంతో జనాలు కర్రీ పాయింట్ కు క్యూ కట్టారు.

ఇక వ్యాపారం మొత్తం బాగా సాగుతున్న సమయంలో కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పాడు ఆర్పీ. తన షాప్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించాడు. ” నేను అనుకున్నదానికంటే కర్రీ పాయింట్ చాలా బాగా రన్ అవుతోంది. జనాలను ఆపలేకపోతున్నాం. అయితే వారికి సరైన సమయంలో కర్రీస్ ను అందివ్వలేకపోతున్నా.. అందుకే షాప్ ను మూసివేస్తున్నా.. ఎంతమంది వచ్చినా వెయిట్ చేయించకుండా ఇచ్చేలా ఒక కిచెన్ ను ఏర్పాటు చేసి అందులో అన్ని సౌకర్యాలను ఉంచిన తర్వాతే మళ్లీ షాప్ ఓపెన్ చేస్తాను. అప్పటివరకు అందరు నన్ను క్షమించాలి” అని కోరాడు. అయితే మరోపక్క ఆర్సీని ఎవరో ఈ కర్రీ పాయింట్ మూసివేయాలని బెదిరిస్తున్నారని, వారి నుంచి తప్పించుకోవడానికే కర్రీ పాయింట్ ను మూసివేసినట్లు మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా నెల్లూరు చేపల పులుసును నెలరోజుల్లోనే బంద్ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు జబర్దస్త్ కమెడియన్.

Show comments