టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. ఇప్పటికే రిలీజైన కింగ్డమ్ టైటిల్ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. షూటింగ్ ముగించి రీ రికార్డింగ్ వర్క్స్ లో బిజీగా ఉంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన కోసం అనిరుధ్ నుంచి మరో పాట రావాల్సి ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Also Read : WAR 2 : వార్ 2 తెలుగు కోసం పట్టువదలని టాలీవుడ్ ప్రొడ్యూసర్
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గందరగోళం నెలకొంది. ఈమొదట జులై 4న రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించిన మేకర్స్ ఇప్పడు వాయిదా వేశారు. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కొత్త రిలీజ్ డేట్ మీద నెట్ ఫ్లిక్స్ తో డిస్కషన్ మొదలైంది. ఆగస్టులో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఆగస్ట్ 1న రావాలా లేదా జూలై 25న రిలీజ్ చేయాలా అనే విషయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి క్లారిటీ రావాల్సి వుంది. జులైలో రావాల్సి ఉండగా అక్కడ పవర్ స్టార్ హరిహర వీరమల్లుతో సమస్య వస్తుంది. ఆ సినిమా జులై 24న రాబోతుంది. ఈ నేపధ్యంలోనే ఆగస్టు ఫస్ట్ వీక్ లో వచ్చేందుకు కింగ్డమ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ అందు కోసం నెట్ ఫ్లిక్స్ ఒప్పించేందుకు మొదలైన చర్చలు ఎప్పుడు కొలిక్కివస్తాయేమో చూడాలి.
