కింగ్ నాగార్జున నుంచి ఒక సినిమా అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని ఫ్యాన్స్ ఈ ఇయర్ నాగార్జున బర్త్ డే రోజున మన్మథుడు సినిమాని రీరిలీజ్ చేసుకోని ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా మన్మథుడు సినిమాని చూసి నాగార్జున బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్న ఫ్యాన్స్ కి కిస్ ఇస్తూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కింగ్ నాగ్, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ప్రోమో షూట్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
ఆగస్టు 29న “నా సామీ రంగ” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వనుంది. ప్రోమోని రిలీజ్ చేస్తూ రిలీజ్ అండ్ మూవీ టైటిల్ ని కూడా రివీల్ చేయనున్నారని సమాచారం. శరవేగంగా షూటింగ్ చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది నాగార్జున ప్లాన్. సంక్రాంతి బరిలో ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్, ప్రాజెక్ట్ కల్కి లాంటి భారీ సినిమాలు లూప్ లైన్ లో ఉన్నాయి. వీటి మధ్యలో నాగార్జున తన సినిమాని సంక్రాంతి రేస్ లోకి తెచ్చాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా నాగార్జున ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నా కూడా తన సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టడానికి అసలు వెనుకాడడు. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి హిట్స్ గా నిలిచినవే. మౌత్ టాక్ ని మాత్రమే నమ్మే నాగార్జున ఇప్పుడు ‘నా సామీ రంగ’ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.
