NTV Telugu Site icon

King Nag: నా సామిరంగ… జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసారు

King Nag

King Nag

కింగ్ నాగార్జున నటిస్తున్న ‘నా సామీ రంగ’ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో బ్యాడ్ ఫేజ్ ఉన్న అక్కినేని అభిమానుల్లో జోష్ నింపడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ హెయిర్ తో, విలేజ్ లుక్ లో నాగార్జున మాస్ గా కనిపించడంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లోకి వచ్చారు. గ్లిమ్ప్స్ ఎండ్ లో “ఈ సంక్రాంతికి నా సామీ రంగ” అని నాగార్జున మీసం మెలేసి చెప్పాడు. దీంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది అనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు కింగ్ నాగ్. చెప్పినట్లుగానే జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూ, ప్రమోషన్స్ ని కూడా మ్యానేజ్ చేస్తున్నాడు నాగార్జున.

ఇప్పటికే నా సామిరంగ సినిమా నుంచి టీజర్ బయటకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది, సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఇలా నా సామిరంగ సినిమా నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసాయి. ఇదిలా ఉంటే జనవరి 5తో నా సామిరంగ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేస్తారని సమాచారం. ఒక సాలిడ్ మాస్ సాంగ్ తో షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు చిత్ర యూనిట్. సెప్టెంబర్ నెలలో మొదలైన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్-నవంబర్-డిసెంబర్… కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేయడం అనేది బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి. మరి కింగ్ నాగ్… బంగార్రాజు సినిమా తరహాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ కొడతారో లేదో చూడాలి.

Show comments