NTV Telugu Site icon

Sharukh Khan: ‘జవాన్’గా మారిన ‘పఠాన్’

Jawan

Jawan

కింగ్ ఖాన్ అని తనని అందరూ ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ లేని ఒక హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే హిట్, సూపర్ హిట్ అవుతుందేమో కానీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్నో స్టార్ హీరోలు నటించిన భారి బడ్జట్, సూపర్ హిట్ సినిమాలకి కూడా అందుకోవడానికి కష్టమైన బాహుబలి 3 రికార్డులకే ఎసరు పెట్టేలా ఉంది అంటే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. దాదాపు అయిదేళ్ల తర్వాత ‘పఠాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన షారుఖ్ ఖాన్, కేవలం ఏడు రోజుల్లో 640 కోట్లు రాబట్టాడు అంటే అతని రికార్డుల ఊచకోత ఏ రేంజులో జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ అంటే హీరో కాదు ఇండియన్స్ కి అతనో ఎమోషన్ అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూ పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

Read Also: Pathan Effect: వెనక్కి వెళ్లిన అల వైకుంఠపురం లో రీమేక్

ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా పెట్టకుండా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకుండా కేవలం టీజర్, ట్రైలర్ ని మాత్రమే రిలీజ్ చేసి కూడా షారుఖ్ ఖాన్ ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. అది అతని స్టార్ డమ్ కి నిదర్శనం. పఠాన్ ఫీవర్ లో నుంచి బాలీవుడ్ పూర్తిగా కోలుకోక ముందే షారుఖ్ ఖాన్, ‘జవాన్’ సినిమా న్యూస్ తో బీటౌన్ ని శేక్క్ చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ‘జవాన్’ సినిమా షూటింగ్ లో షారుఖ్ ఖాన్ జాయిన్ అయ్యాడు, ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి షారుఖ్ ఖాన్ ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొహానికి ముసుగు కట్టుకోని ఉన్న షారుఖ్ ని చూసిన ఫాన్స్ #jawan అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా జూన్ 2న ఆడియన్స్ ముందుకి రానుంది. 2018 నుంచి సినిమా చెయ్యని షారుఖ్, 2023లో జస్ట్ ఆరు నెలల గ్యాప్ లో మరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. All Hail The King Khan Sharukh Khan…

Show comments