NTV Telugu Site icon

Kiki Vijay: ‘8 ఏళ్ల బ్రేకప్, మళ్లీ లవ్లో పడి పెళ్లి.. సీక్రెట్ బయటపెట్టిన నటుడి భార్య!

Kiki Vijay Shantanu

Kiki Vijay Shantanu

Kiki Vijay Revals her Breakup and patchup story in a latest interview: తమిళ నటుడు శంతను భాగ్యరాజ్ తెలుగు వారికి కాస్త కొత్తనే కానీ కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఆయనను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగులో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన డైరెక్టర్, నటుడు, భాగ్యరాజ్ కొడుకుగా సినీ రంగంలో అడుగుపెట్టారు. సక్కరకత్తి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తమిళ్ లో వరసు సినిమాలు చేస్తున్నారు. తాజాగా శంతను భాగ్యరాజ్, అతని భార్య కికీ విజయ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ, బ్రేకప్ వంటి అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2015లోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరగగా ఓ ఇంటర్వ్యూలో తమ బ్రేకప్ గురించి మాట్లాడారు. ‘మేం ముందు ప్రేమించుకున్నాం, ఆ తర్వాత బ్రేకప్ అయ్యింది.

Shweta Basu Prasad: పండుగ పూట అద్దం ముందు మైండ్ బ్లాకయ్యే హాట్ ట్రీట్ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్

దాంతో ఎనిమిదేళ్లు దూరంగా ఉన్నాం కానీ ఓ సందర్భంలో మళ్లీ లవ్ లో పడ్డామని చెప్పుకొచ్చారు. గతంలో చిన్నచిన్న విషయాలకే బాగా గొడవపడే వాళ్లం’ అని ఆయన మెమొరీస్ గుర్తు చేసుకున్నారు. ఇక ఆయన భార్య కికీ విజయ్ మాట్లాడుతూ శాంతనుని నేను బాగా ప్రేమించాను, అయితే లవ్ లో ఉన్నప్పుడు ఓ ఘటన ఇప్పటికీ బాగా గుర్తుందని అన్నారు. శాంతను వేరే అమ్మాయితో కాఫీ షాప్ లో ఉన్నాడని నా ఫ్రెండ్ ఒకరు చూసి కాల్ చేస్తే నేను ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగితే ఆయన మా నాన్న తో ఉన్నానని అబద్ధం చెప్పాడని అన్నారు. ఇలా చిన్నచిన్న గొడవలు పెద్దవయి బ్రేకప్ చెప్పుకున్నామని అన్నారు. ఎనిమిదేళ్లు విడిపోయాం కానీ ఓ షోలో ఇద్దరం కలిసి డాన్స్ చేయాల్సి రావడంతో మళ్లీ ఒక్కటయ్యామని చెప్పుకొచ్చింది. అయితే బ్రేకప్ అయిన ఎనిమిదేళ్లకు మళ్లీ లవ్ లో పెళ్లి కూడా చేసుకోవడం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.

Show comments