Site icon NTV Telugu

MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’.. ఫ్యాన్స్ కోసం ఓటీటీ స్పెషల్ సర్‌ప్రైజ్‌

Max

Max

కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’.  టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న కన్నడతో పాటు తెలుగులోనూ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కంటెంట్ తో పాటు కమర్షియల్ గాను ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.

Also Read : Mrunal Thakur : చూడ ముచ్చటగా ఫోటోలకు ఫోజులిస్తున్న మృణాల్

థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇటీవల 50 రోజుల థియేట్రికల్ రన్ ఫినిష్ చేసుకుంది. వరల్డ్ వైడ్ గా మాక్స్ రూ. 78.5 కోట్లకు పైగా రాబట్టి కిచ్చా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అటు కిచ్చా సుదీప్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది జీ 5. అయితే ఈ సినిమాను మొదట ఫిబ్రవరి 22 న జీలో కన్నడలో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపింది. కానీ ఫ్యాన్స్ కు స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇస్తూ అనుకున్న దానికంటే ముందుగా ఈ నెల 15న నుంచే కన్నడ, తెలుగు, తమిళ్‌, మలయాళంలో స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నామని ప్రకటించింది జీ5. దాంతో పాటుగా మరొక సర్‌ప్రైజ్‌ ను ప్లాన్ చేస్తూ మాక్స్ సినిమాను ‘జీ కన్నడ’ ఛానల్‌లో 15న రాత్రి 7:30లకు టెలికాస్ట్ చేస్తోంది సదరు సంస్థ.

Exit mobile version