Kiara Advani: ప్రస్తుతం సోషల్ మీడియా ఎలా ఉందంటే.. ఒక హీరో హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ, పెళ్లి అంటున్నారు. పెళ్లి అయ్యి మూడు నెలలు కాకుండానే అప్పుడే తల్లి కాబోతుంది అని అంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు లూజ్ డ్రెస్ ల్లో కనిపించినా.. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదే కియారా.. హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి వివాహమాడిన విషయం తెల్సిందే. ఇక ఇద్దరు బిజీ బిజీ యాక్టర్స్ కావడంతో ఈ జంట పెళ్లి తరువాత కూడా షూటింగ్స్ లో బిజీగా మారారు.
Tamannaah: శృంగారం హీరోలు చేస్తే స్టార్లు అవుతారు.. హీరోయిన్స్ చేస్తే క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు..
ఇక ప్రస్తుతం కియారా సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి కియారా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమ్మడి ఫోటోషూట్స్ చూస్తుంటే మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు అభిమానులు. అందుకు కారణం ఆమె టైట్ డ్రెస్ లు వేసుకొని ఫోటోషూట్స్ లో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తుంది. సాధారణంగా ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు.. లూజ్ డ్రెస్ లు వేసుకుంటారు.. అందాల అరబోత పక్కన పెడితే.. కొద్దిగా డ్రెస్సింగ్ విషయం లో జాగ్రత్తగా ఉంటారు. కానీ, ఈ ముద్దుగుమ్మ అవేమి లేకుండా ప్రమోషన్స్ లో జోరుగా హుషారుగా పాల్గొంటుంది. దీంతో ఆ వార్తలు అన్నిఫేక్ అని తెలుస్తుంది. ఇక తాజాగా ఈ చిన్నది రెడ్ డ్రెస్ లో హీట్ పుట్టించింది. ఎద అందాలను ఆరబోసి ఆ నవ్వులతో కుర్రకారు గుండెలను పీల్చేసింది. ఇకపోతే ప్రస్తుతం కియారా తెలుగులో చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది.