Site icon NTV Telugu

Khiladi దర్శకుడిని రాజమౌళితో పోల్చిన నిర్మాత

Khiladi

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం “ఖిలాడీ” రేపు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. చిత్ర యూనిట్ నిన్న సాయంత్రం “ఖిలాడీ” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు సత్య నారాయణ రవితేజ అభిమానులకు ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రవితేజ ఇమేజ్‌ని పెంచుతుందని హామీ ఇచ్చారు. సినిమా విజయంపై కొండేరు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ రమేష్ వర్మపై ప్రశంసలు కురిపిస్తూ దర్శకుడు సినిమాకు చేసిన కృషికి గర్వపడుతున్నానని అన్నారు. ఈ క్రమంలో నిర్మాత సత్యనారాయణ ‘ఖిలాడీ’ డైరెక్టర్ రమేష్ వర్మను రాజమౌళితో పోల్చారు. “సాధారణంగా సినిమా కనెక్టివిటీని తీసుకురావడం చాలా కష్టం. నాకు రాజమౌళి సినిమాలాగే అన్పించింది. సెకండాఫ్ లో రైటర్స్, డైరెక్టర్స్ ఫెయిల్ అవుతుంటారు. ఈ సినిమాను పర్ఫెక్ట్ గా చేశారు” అంటూ డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపించారు నిర్మాత.

Read Also : Khiladi కాంట్రవర్సీ రూమర్స్… ఫుల్ స్టాప్ పెట్టేసిన నిర్మాత

Exit mobile version