నందమూరి బాలకృష్ణ, గోపించంద్ మలినేని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కు మంచి టైటిల్ ను వెతికే పనిలో పడ్డారట మేకర్స్.. ఇకపోతే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో ఒక మాస్ సాంగ్ ఉందనున్నదని, ఆ సాంగ్ లో బాలయ్య సరసన కోలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయతి నటిస్తునట్లు టాక్ నడుస్తోంది.
‘గద్దలకొండ గణేష్ ‘ చిత్రంలో ఫుల్ మాస్ సాంగ్ కి స్టెప్పులేసి టాలీవుడ్ కుర్రకారు కంట్లో పడ్డ ఈ డస్కీ బ్యూటీ ‘ఖిలాడీ’ చిత్రంలో రవితేజ సరసన ఆడిపాడింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయేసరికి మళ్లీ అమ్మడు హిట్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో అమ్మడు బాలయ్యనే నమ్ముకున్నదట. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో బాలయ్య డింపుల్ హయతిలపై ఆ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని వినికిడి. మరి ఈ అమ్మడికి ఈ సాంగ్ కలిసివచ్చి టాలీవుడ్ లో వరుస అవకాశాలు ఏమైనా అందుతాయేమో చూడాలి.
