2019లో విడుదలైన ‘ఖైదీ’ సినిమా హీరో కార్తి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఒక్క రాత్రి నేపథ్యంలో ఎలాంటి పాటలు లేకుండా, హీరోయిన్ లేకుండా..కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. థ్రిల్లింగ్ కథనం, కర్తి పవర్‌ఫుల్ నటన కలిసి సినిమాను కల్ట్ స్టేటస్‌కి చేర్చాయి. అప్పటి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ వాయిదా పడిందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కారణం ఏమిటంటే..
Also Read : Samantha : అర్ధనగ్నంగా రెచ్చిపోయిన సమంత.. కానీ ఎందుకు ఇంత డేరింగ్?
లోకేష్ తాను ప్రస్తుతం రజినీకాంత్–కమల్ హాసన్‌లతో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. దీంతో ‘ఖైదీ 2’ తాత్కాలికంగా వెనక్కి వెళ్లిందని టాక్. ఇక మరో కారణం కూడా వినిపిస్తోంది. ఏంటంటే ‘ఖైదీ 2’కి ఉన్న హైప్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని లోకేష్ భావించినట్టు సమాచారం. కూలీ సినిమాకు ఆయన రూ.50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తానే చెప్పాడు. మరి అంతకు మించిన క్రేజ్ ఉన్న ‘ఖైదీ 2’ కోసం 75 కోట్ల డిమాండ్ పెట్టాడట. హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో చర్చలు నడుస్తున్నట్లుగా టాక్. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమో ఇంకా క్లారిటీ లేదు కానీ ప్రజంట్ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.
