Site icon NTV Telugu

Salaar : టీజర్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్… మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారే !

salaar

“రాధేశ్యామ్” నిరాశ పరచడంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “సలార్” మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ గురించి ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానుల కోసమేనా అన్నట్టుగా ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “సలార్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రం విడుదల చేయనున్న థియేటర్లోనే ప్రభాస్ “సలార్” టీజర్ కూడా రిలీజ్ చేస్తారని పుకార్లు మొదలయ్యాయి.

Read Also : Sarkaru Vaari Paata : మహేష్ కు మరోసారి మార్వెల్ ముప్పు

దీంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “KGF2″ను ఏప్రిల్ 14న థియేటర్లలో చూడడంతో పాటు “సలార్” టీజర్ ను కూడా చూసి ఆనందించొచ్చని ప్రభాస్ అభిమానులు భావించారు. కానీ రెబల్ స్టార్ అభిమానులకు నిరాశ కలిగించేలా అవన్నీ రూమర్లు అంటూ మేకర్స్ కొట్టిపారేశారు. “కేజీఎఫ్ 2″తో “సలార్” టీజర్ ను విడుదల చేయబోవడం లేదని, తగిన సమయంలో “సలార్” టీజర్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ప్రభాస్ అభిమానులకు ఇది నిరాశను కలిగించే విషయమే అయినా, “కేజీఎఫ్ 2” మేకర్స్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే చెప్పాలి. “కేజీఎఫ్ 2″పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒకవేళ మేకర్స్ మూవీ టీజర్ పై వచ్చిన ఈ రూమర్లపై క్లారిటీ ఇవ్వకపోతే బహుశా తెలుగు రాష్ట్రాల్లో KGF2 చిత్రానికి చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. సినిమాతో పాటు “సలార్” టీజర్ ను చూడడానికి జనాలు థియేటర్లకు పోటెత్తేవారు. ఏది ఏమైనప్పటికీ KGF నిర్మాతలు పుకార్లతో తెలుగు ప్రేక్షకులను తప్పుదారి పట్టించకూడదనుకోవడం అభినందనీయం !

Exit mobile version