Site icon NTV Telugu

KGF 2 : పవర్ ఫుల్ డైలాగ్స్… హనుమాన్ చౌదరి ఎంట్రీ ఎలాగంటే ?

Hanuman Chowdary

Hanuman Chowdary

KGF 2 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. యష్ దర్శకత్వంలో, సీన్ సీన్ కూ ఒళ్ళు గగుర్పొడిచే ఎలివేషన్స్, నేపథ్య సంగీతం, రాఖీ భాయ్ వయోలెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్… KGF 2 తెలుగు వెర్షన్ లోని పవర్ ఫుల్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ డైలాగ్స్ రాసింది మనోడే ! హనుమాన్ చౌదరి అనే మన తెలుగు వ్యక్తి కావడం విశేషం. కేవలం KGF 2కే కాకుండా ఈ సినిమాకు పోటీగా వచ్చిన “బీస్ట్” మూవీకి కూడా డైలాగ్ రైటర్ హనుమాన్.

Read Also : Hanuman Jayanthi : హనుమతో చెర్రీ… థ్రిల్లింగ్ వీడియో షేర్ చేసిన చిరు !

తెలుగు దర్శకుడు, నటుడు రవిబాబు దగ్గర “అనసూయ”, “నచ్చావులే” అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు హనుమాన్. కానీ “కేజీఎఫ్” ఆయన జీవితాన్ని డైలాగ్ రైటర్ గా కీలక మలుపు తిప్పింది. మరి హనుమాన్ చౌదరికి ఈ అద్భుతమైన అవకాశం ఎలా దక్కింది అనే విషయాన్ని తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. హనుమాన్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బాగా స్ట్రగుల్ పడ్డారట. కైకాల సత్యనారాయణ తనయుడు రామారావు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. అప్పటికే ఆయనతో పరిచయం ఉండగా, ఒకానొక సందర్భంలో “కేజీఎఫ్” అనే కన్నడ సినిమా చేస్తున్నాము. తెలుగు వెర్షన్ కు నేటివిటీకి తగ్గట్టుగా డైలాగ్స్ రాయాలని అడిగారట. వెంటనే హనుమాన్ ఓకే చెప్పడంతో ప్రశాంత్ నీల్ కు పరిచయం చేశారట రామారావు. ఇంకేముంది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ అనే ఫీల్ రాకుండా రాయాలని చెప్పారు. అలా “కేజీఎఫ్” వరల్డ్ లోకి ఎంట్రీ లభించింది హనుమాన్ కి. ఇక ఎన్టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Exit mobile version