Shine Tom Chacko : కేరళలో షైన్ టామ్ చాకో వ్యవహారం వివాదంగా మారింది. డ్రగ్స్ కేసుతో పాటు నటి విన్సీ చేసిన ఆరోపణలు షైన్ టామ్ ను చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. కానీ పోలీసుల విచారణలో మాత్రం తాను డ్రగ్స్ తీసుకున్నట్టు ఆయన ఒప్పుకున్నారు. ఈ ఘటనలపై తాజాగా కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ స్పందించారు. షైన్ టామ్ చాకో విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో షైన్ టామ్ చాకోపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నటి విన్సీ అలోషియస్ చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. డ్రగ్స్ కేసును ఎగ్జైజ్ శాఖ దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
Read Also : Ahaan Panday: అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’… జూలై 18న రిలీజ్!
‘విన్సీకి జరిగినట్టు ఇంకెవరికీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరూ అయోమానికి గురి కావొద్దు. విన్సీ చేసిన ఆరోపణల గురించి పూర్తి వివరాలు మాకు ఇంకా తెలియలేదు. ఆమె ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. ఆమె కూడా సహకరిస్తానని చెప్పింది. గతంలో కూడా షైన్ టామ్ మీద కేసు ఉంది. కానీ ఆ కేసులో పోలీసుల తప్పిదాలు జరిగాయని అప్పుడే కోర్టు గుర్తించింది. ఇండస్ట్రీలో ఈ నడుమ ఇలాంటివి బాగా పెరిగిపోయాయి. వాటిపై సమీక్ష చేస్తున్నాం’ అంటూ చెప్పారు. ఇక షైన్ టామ్ చాకో మీద తాను ఎలాంటి చర్యలు తీసుకోబోను అంటూ విన్సీ నిన్ననే ప్రకటించింది. షైన్ టామ్ కూడా ఆమెకు క్షమాపణలు చెబుతాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇతను తెలుగులో దసరా సినిమాలో విలన్ గా చేశారు.
