Site icon NTV Telugu

ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ vs అమెరికన్ సూపర్ మోడల్!

ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ‘ల్యూ జో’ సూపర్ మోడల్ కెన్డాల్ జెన్నర్ ని కోర్టుకు ఈడ్చే పనిలో ఉంది. ఏకంగా 1.8 మిలియన్ డాలర్ల నష్ట పరిహారం డిమాండ్ చేస్తోంది. అయినా, ఓ ఫ్యాషన్ కంపెనీ మోడల్ నుంచీ డబ్బులు వసూలు చేయటం ఏంటి అంటారా? టాప్ మోడల్ కెన్డాల్ ఓ ఫోటోషూట్ బాగానే చేసింది. అగ్రిమెంట్ ప్రకారం రెండోది చేయమంటే కాదుకూడదని అనేసింది. దాంతో అన్ని ప్రయత్నాలు ముగిసి ‘జో’ ఫ్యాషన్ బ్రాండ్ అమెరికాలోని స్థానిక కోర్టును ఆశ్రయించింది.

ప్రతీ కేసులోనూ రెండు వాదనలు ఉంటాయి కదా… ఇందులోనే అదే జరుగుతోంది. సూపర్ మోడల్ కెన్డాల్ జెన్నర్ తన తప్పేం లేదంటోంది. కరోనా వల్ల, లాక్ డౌన్స్ వల్ల ఆమె 2020లో చేయాల్సిన ఫాటోషూట్ చేయలేకపోయింది. 2019లో మొదటి ఫోటోషూట్ మాత్రం అనుకున్నట్టే జరిగింది. ఇక సెకండ్ ఫోటోషూట్ విషయంలో కెన్డాల్ కు , కంపెనీ వారికి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఆమె ఇతర తేదీల్లో చేసుకొమ్మని చెప్పినా వారు ఫోటోషూట్ కి ముందుకు రాలేదట. అందుకే, కెన్డాల్ పూర్తిగా అగ్రిమెంట్ ని పక్కకు పెట్టేసింది…
ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ వర్సెస్ అమెరికన్ సూపర్ మోడల్ కేసులో… గెలుపు ఎవరిదో, చూడాలి మరి!

Exit mobile version