Site icon NTV Telugu

Keerthy Suresh: సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్

keerthy-suresh

హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనుష్క శర్మల తర్వాత సౌత్ దివాస్ కూడా ‘దట్స్ నాట్ మై నేమ్’ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు సామ్ ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగా, తాజాగా ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరింది. ఆమె కెరీర్ మొదటి నుంచీ పోషించిన పాత్రలను చూపిస్తూ ‘దట్స్ నాట్ మై నేమ్’తో తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక ఆహ్లాదకరమైన క్లిప్‌ను అప్‌లోడ్ చేసింది కీర్తి సురేష్. ఈ ఇన్‌స్టా రీల్ అద్భుతంగా ఉంది.

Read Also : “రైటింగ్ విత్ ఫైర్”పైనే ఆశలన్నీ… ఆస్కార్ నామిషన్లలో ఆసక్తికర డాక్యుమెంటరీ

చారల నైట్‌వేర్‌లో కీర్తి సురేష్ పోజులివ్వడంతో రీల్ మొదలవుతుంది. ఆ తర్వాత మాయ, కావ్య, శైలజ, సెంబరుతి, సావిత్రి, అనుపమ, అర్చ వంటి ఆమె గతం పోషించిన కొన్ని మరపురాని పాత్రలతో కొనసాగుతూ “ఇప్పుడు కళావతి అని పిలవడానికి సిద్ధంగా ఉంది” అని వీడియో ముగుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్ పాత్ర పేరు కళావతి అన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా “సర్కారు వారి పాట” ఎం,మొదటి సాంగ్ విడుదల కానుంది. మరోవైపు కీర్తి సురేష్ “భోళా శంకర్”లో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Exit mobile version