Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!

Keerthy Suresh (2)

Keerthy Suresh (2)

Keerthy Suresh: సినిమా సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కొందరు నేరుగా స్పందిస్తే, మరికొందరు సరదాగా కౌంటర్ ఇస్తుంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అదే చేసింది. నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లో ఆమె ఐటం సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు కీర్తి తనదైన శైలిలో స్పందించింది. ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలైన తర్వాత కీర్తి సురేష్ ఈ సినిమాలో ఐటం సాంగ్ లో  కనిపించవచ్చనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇప్పటివరకు ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ ప్రచారం నేపథ్యంలో ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కీర్తిపై విమర్శలు చేశాడు. ఆమెకు చెప్పుకోదగ్గ పాత్రలు లేకపోవడం వల్లే ఐటం సాంగ్స్ ను ఎంచుకుంటున్నారని ఆరోపించాడు. అంతేకాదు ‘ది ప్యారడైజ్’ను తెలుగు సినిమాకు బదులుగా కన్నడ సినిమాగా ఆవ్యక్తి పేర్కొనడంతో కీర్తి తనదైన స్టైల్ లో స్పందించింది. ఈ కామెంట్‌పై కీర్తి సురేష్ సీరియస్‌గా స్పందించలేదు. ఎలాంటి పెద్ద వివరణ ఇవ్వకుండా సరదాగా, వ్యంగ్యంగా నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చింది. నాని తెలుగు సినిమాల్లో నటిస్తాడని, కన్నడలో కాదని గుర్తుచేస్తూ చిన్న సవరణ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం అభిమానులను ఆకట్టుకుంది.

ఇక ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే నాని హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అదే కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో నాని, రాఘవ్ జుయల్, మోహన్ బాబు, కయదు లోహర్, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడిన తర్వాత ‘ది ప్యారడైజ్’ను 2026 సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమె ఐటం సాంగ్ లో కనిపిస్తారనే ప్రచారం నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తేలనుంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి  ఈ మూవీలో కీర్తి ఐటం రోల్ దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు కీర్తి సురేష్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డోరతీ’లో ఆమె నటిస్తోంది. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తుండగా, రిషికాంత్, సనత్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్దన’లో కీర్తి కనిపించనుంది. దీంతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ప్రాజెక్టుల్లోనూ ఆమె భాగమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీఅనిల్ 5 లేదా ఎన్‌కేఆర్‌ఆర్ 2గా పిలుస్తున్న ప్రాజెక్ట్‌తో పాటు ‘సత్యవాన్ సావితిరి’, ‘అక్క’, ‘రాఫ్తార్’ వంటి సినిమాలు కూడా ఆమె లైనప్‌లో ఉన్నాయి. దీంతో ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌పై వచ్చిన ప్రచారం కంటే, కీర్తి చేతిలో ఉన్న వరుస క్రేజీ ప్రాజెక్టులే ఆమె కెరీర్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన అంశంగా మారాయి.