Site icon NTV Telugu

చీరలో కీర్తి… సొగసు చూడతరమా !

Keerthy Suresh Latest Stills in Red Saree

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా ఉంది. ఆమె మ్యాచింగ్ బ్యాంగల్స్‌తో మెరిసే కళ్ళు, ఎర్రటి లిప్‌స్టిక్‌తో అందంగా కన్పిస్తోంది. అనేక మలయాళ చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తర్వాత కీర్తి ‘గీతాంజలి’తో హీరోయిన్ గా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఇందులో మలయాళ స్టార్ మోహన్ లాల్, నిషన్, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ డ్రామా “నేను శైలజ”తో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’లో ఆమె అద్భుత నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కీర్తి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి “సర్కారు వారి పాట”లో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Exit mobile version